లేఖిని
జులై 28, 2006
ఈ లేఖిని అనే ఉపకరణం తెలుగు అక్షరాలను తేలికగా టైపు చేయటానికి ఉపయోగపడుతుంది. మన లాంటి వాళ్ళు దీని ద్వారా ఆంగ్లంలో తెలుగు భాషని సబ్ధ పరంగా టైపు చేసి, దానిని తెలుగు అక్షర రూపంలోకి తేలికగా మార్చుకోగలము. ఐతే ఇది ఇంటెర్నెట్ ఉన్న సమయంలోనే పనిచేస్తుంది అనేది గుర్తుంచుకోవల్సిన విషయం.వీవెన్ తయారు చేసిన ఈ పరికరం చాలా ఉపయోగకరంగా ఉందని చాలా మంది బ్లాగర్లు, తెలుగు భాషా ప్రేమికులు అంటున్నారు. ఈ ప్రస్థుత పోస్టును నేను కూడా, లేఖిని నుండే ప్రయత్నించాను…బాగుంది.
…వీవెన్ కు ధన్యవాదాలు
ఏంటీ…గిజిగాడా
జులై 26, 2006
అవును, మా గిజిగాడు తెలుగు వారికి ఉపయోగపడే రకరకాల ఉపకరణాలను, సందేశాలను, ఇంకా ఎన్నింటినో వెలుగులోకి తీసుకువస్తాడు.
కాబట్టి, ఔత్సహికులారా, వీడి మీద ఒక కన్నేసి ఉంచండి…..
ఇక చూడండి వీడు ఎట్లా ఎగురుతాడో…!